Kids

ఆ దుష్టుడితో స్నేహం దాంపత్యాన్ని చెడగొట్టింది

ఆ దుష్టుడితో స్నేహం దాంపత్యాన్ని చెడగొట్టింది

ఏడాదిన్నర కాలంగా గేట్స్‌ దంపతులు విడాకులపై సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులు జరిపారట. విడిపోవడానికి దారితీసిన కారణాలను ఈ జంట చెప్పనప్పటికీ.. లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో గేట్స్‌ సంబంధాలు నచ్చని మెలిందా ఆయన నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు ప్రముఖ పత్రిక వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనం పేర్కొంది. 1994లో బిల్‌గేట్స్‌, మెలిందా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 18-25 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలున్నారు. ఎన్నో ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకున్న ఈ జంట.. విడిపోతున్నట్లు మే 3న సంయుక్త ప్రకటన చేసింది. అయితే విడాకుల నిర్ణయాన్ని వీరిద్దరూ చాలా కాలం క్రితమే తీసుకున్నట్లు వాల్‌ స్ట్రీట్‌ కథనం తెలిపింది. తమ దాంపత్య బంధం ‘తిరిగి కొనసాగించలేని విధంగా ముక్కలైంది’ అని చెబుతూ మెలిందా 2019 అక్టోబరులోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారట. మహమ్మారి విజృంభణ సమయంలో దీనిపై సుదీర్ఘ చర్చల అనంతరం విడాకులపై పరస్పర నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.