* మే 12, బుధవారం ఉదయం 10 గంటలనుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలనుండి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం వుంటుందని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది.
* రేపటి నుంచి ఈ నెల 21 వరకు యాదాద్రిలో భక్తుల దర్శనాలు నిలిపి వేస్తున్నట్లు ఆలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
* రుయాలో నిన్న మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం .. సీఎం ప్రకటన
* ప్రముఖ కరోనా వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది.కొవాక్జిన్ టీకాలను నేరుగా రాష్ట్రాలకు పంపిణీకి సిద్ధమైంది.కేంద్ర ప్రభుత్వం చేసిన కేటాయింపుల ప్రకారం రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది.ఇప్పటికే కోవాక్జిన్ టీకాలను 14 రాష్ట్రాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టామని భారత్ బయోటెక్ కంపెనీ కో ఫౌండర్,జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ సుచిత్ర ఎల్ల ట్విటర్‌లో తెలిపారు.
* ఆంధ్రప్రదేశ్ – చత్తీస్ ఘఢ్ సరిహద్దులలో మావోయిస్టులకు కరోనా..పోలీసు నిఘా వర్గాలకు ఉన్న సమాచారం మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన జిల్లా పోలీసు కార్యాలయం..