బర్నింగ్‌స్టార్‌గా అభిమానం సొంతం చేసుకున్న నటుడు సంపూర్ణేష్‌బాబు. సినిమాల్లో కామెడీ హీరోగా కనిపించినా నిజ జీవితంలో మాత్రం నిజమైన హీరో అనిపించుకుంటున్నాడు. ఇటీవల కరోనా సోకి కన్నుమూసిన ప్రముఖ జర్నలిస్టు, నటుడు టీఎన్‌ఆర్ కుటుంబానికి సాయం చేసి తన దాతృత్వం చాటుకున్నాడు. టీఎన్‌ఆర్ సతీమణి బ్యాంకు ఖాతాలో తన వంతు సాయంగా రూ.50వేలు జమచేశాడు. ఈ విషయాన్ని సంపూ ట్విటర్ వేదికగా ప్రకటించారు. టీఎన్‌ఆర్ ఇంటర్వ్యూల వల్ల తన కెరీర్‌తో పాటు వ్యక్తిగతంగానూ ఒక మెట్టి ఎదిగాను అని సంపూ అన్నారు. టీఎన్‌ఆర్ కుటుంబానికి ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తన వంతు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. గతంలోనూ హుద్‌హుద్ తుపాన్ వచ్చినప్పుడు సంపూ తన వంతుగా ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే.
TNR కుటుంబానికి సంపూర్ణేష్ సాయం
Related tags :