Business

వేల కోట్లు ధారపోస్తున్న మందుబాబులు-వాణిజ్యం

Business News - Drunkards Spend Crores Of Rupees To Governments In Telugu States

* మందుబాబులే నిజమైన టాక్స్‌ పేయర్స్‌. వారి ద్వారా వచ్చే ఆదాయాలు ప్రభుత్వాలను ఆపదలో ఆదుకుంటున్నాయి. మద్యం కోసం తొక్కిసలాటలూ, కరోనా నిబంధనల ఉల్లంఘనా అదే రేంజ్‌లో ఉంటుంది. తాజాగా తమిళనాడులో మందుబాబుల కక్కుర్తితో రాష్ట్ర ప్రభుత్వానికి రెండు రోజుల్లోనే సుమారు వెయ్యి కోట్ల ఆదాయం వచ్చి పడింది. సోమవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూసివేస్తుండడంతో మందుబాబులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఒక్కొక్కరు సంచులు… గోతాల నిండా మందు బాటిళ్లు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. దీంతో కేవలం శని, ఆదివారాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రూ. వెయ్యి కోట్ల వరకు మద్యం విక్రయించినట్టు ప్రభుత్వాధికారులు తెలిపారు. ఇంట్లో తినడానికి లేకపోయినా, మద్యం కరువు రాకూడదన్న లక్ష్యంతో అప్పులు చేసి మరీ తెగ కొనుగోలు చేసేశారు.

* వరుసగా గత నాలుగు సెషన్లలో లాభపడ్డ దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు డీలా పడ్డాయి. ఉదయమే ప్రతికూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు రోజంతా నష్టాల్లోనే పయనించాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించలేదు. చివరకు సెన్సెక్స్‌ 340 పాయింట్లు కోల్పోయి 49,161 వద్ద.. నిఫ్టీ 91 పాయింట్లు దిగజారి 14,850 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.33 వద్ద ముగిసింది.

* కోవిడ్‌-19 వేగంగా విస్తరిస్తున్నందున‌.. ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమితం అవుతున్నారు. ఈ కార‌ణంగా ఆన్‌లైన్ లావాదేవీలు సంఖ్య పెరుగుతూ వ‌స్తుంది. దీంతో పాటు సైబ‌ర్ మోసాల‌కు పాల్ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. మాల్వేర్ యాడ్ ఫిషింగ్‌, ఇ-మెయిల్ ద్వారా ఆన్‌లైన్ మోసాల కేసులు ఏడాదికి ఏడాది పెరిగిపోతుండ‌డంతో భార‌త్‌లో సైబ‌ర్ బీమా అవ‌స‌రం కూడా పెరుగుతుంది. కోవిడ్‌-19 స‌మ‌యంలో ఈ ర‌క‌మైన కేసుల సంఖ్య మ‌రింత పెర‌గ‌డ‌మే ప‌రిస్థితిని తెలియ‌జేస్తుంది. సైబ‌ర్ మోసాల‌కు వ్య‌తిరేకంగా ద్ర‌వ్య భ‌ద్ర‌త కోసం ప‌లు బీమా సంస్థ‌లు సైబ‌ర్ బీమాను అందిస్తున్నాయి. సైబ‌ర్ నేరాలు, మాల్వేర్ దాడులను బీమా క‌వ‌ర్లు నిరోధించ‌లేవు అయితే ఈ న‌ష్టాల ఆర్థిక ప్ర‌భావాన్ని త‌గ్గిస్తాయి. ఏది ఏమైనా ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో సైబ‌ర్ నేరాలు, మాల్వేర్ దాడుల బారిన ప‌డ‌కుండా వినియోగ‌దారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

* 5జీ సాంకేతికతకు, కరోనా వ్యాప్తికి మధ్య సంబంధం లేదని టెలికాం విభాగం(డాట్) సోమవారం స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఇటువంటి నిరాధార, తప్పుడు ప్రచారాలను ప్రజలు విశ్వసించరాదని పేర్కొంది. ‘సామాజిక మాధ్యమాల్లో పలు తప్పుదోవ పట్టించే ప్రచారాలు జరుగుతున్నాయి. 5జీ నెట్‌వర్క్‌ పరీక్షల వల్లే కరోనా వ్యాపిస్తోందన్న వదంతులు పుట్టుకొస్తున్నాయి. అసలు పరీక్షలే జరగడం లేదు. అయినా 5జీ సాంకేతికతకు, కరోనాకు సంబంధమే లేదు. అవన్నీ తప్పుడు, అశాస్త్రీయ ప్రచారాలు. మొబైల్‌ టవర్ల నుంచి నాన్‌-అయానైజింగ్‌ రేడియో తరంగాలు, అది కూడా చాలా తక్కువ శక్తితో వెలువడతాయి. అవి జీవించి ఉన్న ఎటువంటి కణాలపై లేదా మానవులపై ఎటువంటి ప్రభావాన్నీ చూపలేవ’ని డాట్‌ వివరించింది. ‘నాన్‌-అయానైజింగ్‌ రేడియేషన్‌ ప్రొటెక్షన్‌పై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కమిషన్‌(ఐసీఎన్‌ఐఆర్‌పీ), డబ్ల్యూహెచ్‌ఓ సిఫారసు చేసిన పరిమితుల కంటే 10 రెట్ల భద్రతా నిబంధనల్లో మనం ఉన్నామ’ని డాట్‌ తెలిపింది. పలు దేశాల్లో 5జీ సేవలను ఇప్పటికే ప్రజలు వినియోగిస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని మొబైల్‌ ఆపరేటర్ల సంఘం కాయ్‌ సైతం పేర్కొంది.