★ ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
★ రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు పెరుగుతుండడంతో కల్యాణకట్ట సిబ్బంది విజ్ఞప్తి మేరకు అధికారులు కేశ ఖండనశాలను నిలిపివేశారు.
★ ఇప్పటికే కల్యాణకట్టలో పనిచేసే సిబ్బందిలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. ఇదిలా ఉండగా..
★ కరోనా మహమ్మారి కారణంగా ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గింది.
★ ఉదయం 6 నుంచి 11 గంటలకు వరకే మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల దర్శనానికి అధికారులు అనుమతి ఇస్తున్నారు.
★ అలాగే క్షేత్రానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు.