కరోనా నుంచి కోలుకున్న తర్వాత చాలామంది అలసిపోయినట్టు, బలహీనంగా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నామని చెప్తుంటారు. వారిలో సాధారణ పనితీరు తిరిగి రావడానికి చాలాసమయం పడుతుంది. శారీరక బలం పెరిగేందుకు క్రమంగా వాకింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఊపిరితిత్తుల పనితీరు సైతం సాధారణ స్థితికి రావాలంటే నిపుణుల సలహా తీసుకొని తగిన విధంగా శ్వాస సంబంధిత వ్యాయామాలు కూడా చేయాలి. మళ్లీ సాధారణ పనితీరుకు తిరిగి రావడానికి ప్రతిరోజూ వెన్నెముక, మోకాళ్లు, మెడ భాగాలు బలంగా ఉండేందుకు తగిన వ్యాయామాలు చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
కరోనా నుండి కోలుకున్నాక వ్యాయామం తప్పనిసరి
Related tags :