కథానాయికగా వినూత్న కథా చిత్రాల్లో మెప్పించిన ఛార్మి ప్రస్తుతం నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థలో సినిమాల్ని తెరకెక్కిస్తోంది. ఇటీవల ఆమె పెళ్లి తాలూకు వార్తలు సోషల్‌మీడియాలో హల్చల్ చేశాయి. బంధువుల అబ్బాయితో ఛార్మి పెళ్లికి సిద్ధపడుతోందని…ముహూర్తం కూడా ఖరారైందని పలు కథనాలు వెలువడ్డాయి. వీటిపై ఛార్మి ట్విట్టర్లో స్పందించింది. ప్రస్తుతం తాను జీవితంలో గొప్ప దశను ఆస్వాదిస్తున్నాని, ప్రతి విషయంలో సంతోషంగా ఉన్నానని పేర్కొంది. ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఏమాత్రం లేదని తేల్చిచెప్పింది. వివాహబంధంలోకి అడుగుపెట్టే తప్పు జీవితంలో ఎప్పుడూ చేయనని స్పష్టం చేసింది. ఛార్మి ట్విట్టర్ స్టేట్మెంట్ సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
మహర్దశ అనుభవిస్తున్నాను
Related tags :