పెద్దపులి ఎక్కడుండాలి? అడవుల్లో ఉండాలి లేదా జూపార్కుల్లో ఉండాలి. కానీ హ్యూస్టన్ వీధుల్లో పరుగులు తీయడం ఏమిటి? జనం దడుసుకుని పోలీసులకు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. పులిని చూసినవారు దాని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పులి సంచరిస్తున్నది పిల్లాపాపలతో కూడిన బస్తీ. డ్యూటీలో లేని ఓ పోలీసు అధికారి ఇంటిదగ్గర పులి కనిపించడంతో ఆయన పిస్టల్ తీసుకుని దాని వెంట పడ్డాడు. ఈ వీడియో కూడా వైరల్ అయింది. కానీ పులి మాత్రం దొరకలేదు. అది ఓ పెంపుడు పులి. 26 ఏళ్ల విక్టర్ హ్యూగో క్యూవస్ దాని యజమాని. అతడు ఓ హత్యకేసులో నిందితుడు. బెయిలు పైన తిరుగుతున్నాడు. పోలీసులు పులి కోసం వీధుల్లో వెతుకుతుండగానే విక్టర్ కారులో పులిని ఎక్కించుకుని ఉడాయించాడు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు ఇల్లంతా గాలించినా పులి జాడ కనిపించక పోవడంతో ఖంగు తిన్నారు. పులివేట ఇంకా కొనసాగుతున్నదని ట్విట్టర్‌లో హ్యూస్టన్ పోలీసులు తెలిపారు.
హ్యూస్టన్ ప్రజలను హడలెత్తించిన పెద్దపులి
Related tags :