Health

6నెలల వరకు యాంటీబాడీల జాడ

6నెలల వరకు యాంటీబాడీల జాడ

కొవిడ్‌ బారినపడిన తరువాత ఎనిమిది నెలల వరకు శరీరంలో యాంటీ బాడీలు ఉంటున్నాయి. ఈ విషయం ఇటలీలో జరిపిన పరిశోధనల్లో వెల్లడయింది. కొవిడ్‌ బారిన పడిన వారిలో ఎన్ని రోజుల వరకు యాంటీబాడీలు ఉంటున్నాయనే అంశాన్ని తెలుసుకోవడం కోసం ఇటలీలోని ఐఎస్‌ఎస్‌ నేషనల్‌ హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనం జరిపారు. ఇందులో భాగంగా కొవిడ్‌ సోకిన 162 మందిని పరిశీలించారు. ‘‘రోగుల వయస్సు, వ్యాధి తీవ్రతతో సంబంధం లేకుండా యాంటీబాడీలు ఎనిమిది నెలలు ఉంటున్నాయి’’ అని మిలాన్‌లోని సాన్‌ రాఫెల్‌ ఆసుపత్రి ఒక ప్రకటనలో వెల్లడించిందికొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి మొదలయిన మార్చి, ఏప్రిల్‌ నెలల్లో తరువాత నవంబర్‌ చివరి వారంలో రక్తనమూనాలను సేకరించారు. ఈ నమూనాలన్నీ కొవిడ్‌ బారిన పడి చనిపోయిన వారివి. వారి రక్తనమూనాలను ఎనిమిది నెలల తరువాత పరీక్షించినప్పుడు యాంటీబాడీలు కనిపించాయి. పరిశోధన వివరాలను నేచర్‌ కమ్యూనికేషన్స్‌ అనే సైంటిఫిక్‌ జర్నల్‌లో ప్రచురించారు. కొవిడ్‌ సోకిన పదిహేను రోజుల్లో శరీరం యాంటీబాడీలు తయారుచేసుకోలేకపోతే వారు కొవిడ్‌ ఇతర రూపాలను అభివృద్ధి చేసే ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు.