కన్నడ సోయగం నభానటేష్ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత జీవితంలో ముఖ్యసంఘటనల్ని షేర్ చేస్తూ అభిమానుల్ని అలరిస్తుంటుంది. తాజాగా తెలంగాణలో పదిరోజుల పాటు లాక్‌డౌన్ విధించిన దృష్ట్యా ప్రతి ఒక్కరు ప్రభుత్వ నియమాల్ని పాటిస్తూ ఇంటిపట్టునే ఉండాలని కోరింది నభానటేష్. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. ‘లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో సురక్షితంగా ఉంటూ ఆశావాహ దృక్పథాన్ని పెంచుకోండి. ఈ సంక్షోభ సమయాల్లో కుటుంబానికి, స్నేహితులకు మనమున్నామనే భరోసానివ్వాలి. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ మానసికంగా కృంగిపోయి ఉన్నారు. కాబట్టి మీ ఆప్తులు, సన్నిహితుల్ని విధిగా ఫోన్‌లో పలకరించండి. అనునిత్యం వారితో టచ్‌లో ఉండండి. అదొక్క పని చాలు మన శ్రేయోభిలాషులందరికి కొండంత ధైర్యాన్నిస్తుంది’ అని నభానటేష్ తెలిపింది. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో ‘మ్యాస్ట్రో’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
నభా భరోసా
Related tags :