* రామ్ గోపాల్ వర్మ.. ఈయన గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఈ పేరే ఒక సంచలనం. ఎప్పుడు ఎవరిని ఏ రకంగా గిల్లుతాడో ఆయనకే తెలియదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎదో ఒక విషయం పై వ్యంగ్యంగా స్పందిస్తూ జనాల్లోహాట్ టాపిక్ కావడం ఒక్క వర్మకే చెల్లుతుంది. ఇటీవల ఆయన ఎక్కువగా రాజకీయ నాయకులను టార్గెట్ చేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోదీలపై విమర్శనాత్మక ట్వీట్లు చేస్తున్నాడు.దీంతో వర్మ రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. ఈ రూమర్లపై తాజాగా వర్మ స్పందించాడు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని, ప్రజలకు ఏదో చేయాలనే కోరికే లేదని కుండబద్దలు కొట్టాడు. ఓ తెలుగు వార్త చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.
* తెలంగాణ లో కొత్తగా 4693 పాజిటివ్ కేసుల నమోదు. 33 మంది మృతి
* ఒంగోలులో బోగస్ ఆసుపత్రి గుట్టురట్టు…ఒంగోలు నగరంలో ఓ బోగస్ ఆసుపత్రి గుట్టురట్టైంది.
* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. 24 గంటల వ్యవధిలో 22,399 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 13,66,785కి చేరింది. కరోనాతో మరో 89 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు 9,077 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 11,56,666 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 2,01,042గా ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,77,02,133 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.
* ఎఫ్‌డీఏ, డబ్ల్యూహెచ్‌వో అనుమతి పొందిన ఏ టీకానైనా దిగుమతి చేసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. విదేశీ టీకాల దిగుమతికి ఒకట్రెండు రోజుల్లోనే అనుమతి ఇస్తామని పేర్కొంది. టీకాల దిగుమతి కోసం ఎలాంటి దరఖాస్తులు పెండింగ్‌లో లేవని చెప్పింది. ఫైజర్, మోడెర్నా టీకా సంస్థలు విదేశాంగ శాఖను సంప్రదించాయని తెలిపింది. భారత్‌లో టీకా ఉత్పత్తి చేసేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ సిద్ధంగా ఉందని వెల్లడించింది. ఆగస్టు-డిసెంబర్ మధ్య భారత్‌లో 216 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్రం వివరించింది.
* హైదరాబాద్ నగరంలో రెండో రోజు లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.
* జర్నలిస్టుల కోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చిన సుప్రీం కోర్టు.యాప్ ను ప్రారంభించిన సి.జె.ఐ జస్టిస్ ఎన్.వి రమణ.కరోణా తీవ్రత దృష్ట్యా యాప్ అందుబాటులోకి తెచ్చిన సుప్రీంకోర్టు.జస్టిస్ కన్విల్ కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్ ల ఆధ్వర్యంలో యాప్ రూపకల్పన.మూడు రోజుల్లోనే యాప్ రూపొందించిన సుప్రీంకోర్టు సాంకేతిక బృందం.సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారానికి నేను సిద్ధం: సి.జె.ఐ ఎన్.వి రమణ.ప్రత్యక్ష ప్రసారాలపై సహ న్యాయమూర్తులతో చర్చిస్తాం: సి.జె.ఐ.ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తాం.జర్నలిస్టుగా బస్సులో తిరిగి వార్తలు సేకరించిన రోజులు గుర్తున్నాయి:: సి.జె.ఐ.ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు పడుతున్న బాధలు మాకు తెలుసు:: సి.జె.ఐ.కోర్టు కార్యకలాపాల కోసం ఇబ్బంది పడకూడదనే యాప్ రూపకల్పన.సుప్రీంకోర్టు, మీడియాకు వారధిగా ప్రత్యేక అధికారిని నియమిస్తాం:: సి.జె.ఐ.అక్రిడిటేషన్ల మంజూరులో హేతుబద్ధతతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటాం:: సి.జె.ఐ.
* రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ‘‘జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు’’ వాహనాలను ఎంపీ మార్గాని భరత్ గురువారం ప్రారంభించారు.
* కొవిడ్ రెండో దశ ఉద్ధృతి సమయంలో పార్లమెంట్ నూతన భవన నిర్మాణం, ఔషధాలు, వ్యాక్సిన్ల కొరతపై రోజుకో ట్వీట్‌తో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.
* కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించాలని భావించినప్పటికి టీకాల కొరత వల్ల పలు రాష్ట్రాల్లో అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోవాగ్జిన్ ఫార్ములాను మరికొన్ని కంపెనీలకు ఇవ్వడానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.
* రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. దీనికి డిప్యూటీ సీఎం ఆళ్లనాని, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందులో ముఖ్యంగా కేబినెట్ సబ్‌కమిటీ నివేదిక, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్‌పై చర్చలు జరిగినట్లు తెలిపారు.