Health

రెండు రకాల వ్యాక్సిన్లు వేయించుకోవచ్చా?-TNI కరోనా బులెటిన్

TNI COVID Bulletin - Can you take two types of COVID vaccines?

* ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చిన వేళ.. మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే, డిమాండ్‌కు తగిన వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో చాలా దేశాలు వ్యాక్సిన్‌ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని అధిగమించేందుకు అందుబాటులో ఉన్న వేర్వేరు వ్యాక్సిన్‌ డోసులను తీసుకోవచ్చా? అనే కోణంలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపట్టారు. ఇలా తీసుకునే వారిలో దుష్ర్పభావాలు ఎక్కువగానే ఉన్నట్లు తాజా పరిశోధనల్లో వెల్లడైంది. వీటివల్ల తీవ్ర ప్రమాదం లేనప్పటికీ.. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నందున రెండు వేర్వేరు వ్యాక్సిన్‌ డోసులను తీసుకోకపోవడమే ఉత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

* దేశ రాజధాని దిల్లీలో ఆక్సిజన్‌కు డిమాండ్‌ తగ్గినందున అదనంగా ఉన్న ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాలకు కేటాయించాలని దిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దిల్లీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆక్సిజన్‌ అవసరం తగ్గిందని దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా అన్నారు. ఆస్పత్రుల్లో పడకలు ఖాళీ అవుతున్నాయని, ఆక్సిజన్‌కు డిమాండ్‌ తగ్గుతోందని చెప్పారు. 15 రోజుల క్రితం 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం అవ్వగా.. ప్రస్తుతం 582 మెట్రిక్‌ టన్నులు సరిపోతోందన్నారు. తమ అవసరాలకు పోగా మిగిలిన ఆక్సిజన్‌ను అవసరమున్న రాష్ట్రాలకు కేటాయించాలన్నారు. బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశామన్నారు. దిల్లీ ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం, దిల్లీ హైకోర్టు చూపిన చొరవకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. దిల్లీలో గడచిన 24 గంటల్లో 10,400 మంది కరోనా బారిన పడ్డారని, పాజిటివిటీ రేటు 14 శతానికి పడిపోయిందని సిసోడియా పేర్కొన్నారు.

* రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి మళ్ళీ అసుపత్రి కి దూళిపాళ్ల నరేంద్ర!కోవిడ్ తగ్గిందని నిన్న సాయంత్రం విజయవాడ హాస్పిటల్ నుంచి దూళిపాళ్లను రాజమండ్రికి తరలించిన పోలీసులు.ఆరోగ్య పరిస్తితి దృష్ట్యా రాజమండ్రి జైల్ నుంచి మళ్ళీ ఆసుపత్రికి నరేంద్ర ను తరలించాలని ఏసీబీ కోర్ట్ ఆదేశం.తమ అనుమతి లేకుండా ఈ సారి ఆసుపత్రి నుంచి జైలుకు తరలించవద్దని ACB కోర్ట్ ఆదేశం.తమకు సమాచారం ఇవ్వకుండా నరేంద్ర ను తరలించడం పై పోలీసులపై ACb కోర్ట్ ఆగ్రహం.

* రాష్ట్రంలోని నమోదైన మొత్తం 13,63,890 పాజిటివ్ కేసులకు గాను 11,53,771 మంది డిశ్చార్జ్ కాగా 9,077 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,01,042.

* రెండో విడత కరోనాను ఎదుర్కోవడంలో తెలంగాణ సర్కార్ ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కరోనా వ్యాక్సిన్‌ను కేవలం రెండు కంపెనీలే తయారు చేస్తున్నాయని, మిగతా కంపెనీలకు కేంద్ర అనుమతే లేదని, అలాంటి సమయంలో గ్లోబల్ టెండర్లను ఎందుకు పిలుస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరిని మభ్య పెట్టడం కోసం ఆ టెండర్లను పిలుస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం కరోనా కేసులను తగ్గించి చూపడం వల్లే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు, మెడిసిన్లు తక్కువగా పంపుతోందని ఆరోపించారు. కరోనా వ్యాక్సిన్ తెలంగాణలోనే తయారవుతోందని, తెలంగాణ అవసరం తీరిన తర్వాతే బయట రాష్ట్రాలకు ఇస్తామని కేసీఆర్ ఎందుకు చెప్పడం లేదని సూటిగా ప్రశ్నించారు.

* వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఉదయం నుంచి కరోనా టెస్ట్ కోసం నిల్చున్న బాధితులతో అక్కడి స్టాఫ్ నర్స్, అటెండర్లు దురుసుగా ప్రవర్తించారని బాధితులు ఆందోళన చేపట్టారు. రోజుకు 15 టెస్ట్ లు మాత్రమే చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు అని పరీక్ష కోసం అనేక మంది క్యూ లైన్ లో నిల్చున్న కనీస సమాచారం కూడా ఇవ్వకుండా మనుషులకు పుట్టలేదా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి.ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దురుసుగా ప్రవర్తించారని అవేదన వ్యక్తం చేస్తున్నారు భాదితులు…ఇదంతా ఫోన్ లో వీడియో తీసిన భాదితులు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇంతా జరుగుతున్నా మెడికల్ ఆఫీసర్ లేకపోవటం విశేషం.