‘ఒక్కసారి కెమేరా ముందుకు వెళితే నేను అన్నీ మర్చిపోతాను’’ అంటున్నారు హీరోయిన్ కృతీ సనన్. అంటే.. చెప్పాల్సిన డైలాగులతో సహా అనుకుంటారేమో! అదేం కాదు. మరేంటి అంటే.. ఆ విషయం గురించి కృతీ సనన్ మాట్లాడుతూ – ‘‘కరోనా కారణంగా గత ఏడాది పెద్దగా షూటింగ్స్‌లో పాల్గొనే అవకాశం దొరకలేదు. పని లేకుండా ఇంట్లోనే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది. ఎప్పుడెప్పుడు షూటింగ్‌లు మొదలవుతాయా? అని ఎదురు చూశాను. ఈ క్రమంలో నేను గ్రహించిన విషయం ఏంటంటే… నేను కెమేరాకి దూరంగా ఉండలేనని. పనంటే అంత ప్రేమ, శ్రద్ధ ఉన్నాయి కాబట్టే కెమేరా మందుకెళ్లగానే నా వ్యక్తిగత విషయాలను మరచిపోతాను. షూటింగ్ లొకేషన్‌లో ఉంటేనే నేను ఎక్కువ సంతోషంగా ఉంటాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాతో పాటు పలు హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు కృతీ సనన్.
అక్కడ అన్నీ మరిచిపోతాను
Related tags :