ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తన కుటుంబాన్ని పోషించేందుకు 16వ సంవత్సరంలోనే పనిలో చేరారని వెల్లడించింది బాలీవుడ్ భామ నోరా ఫతేహి. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న నోరా తన జీవితం గురించి తెలియని పలు విషయాల్ని పంచుకుంది. ‘ఒకప్పుడు మా కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అది చూసి చేతనైన సాయం చేయాలనిపించి నేను మా పాఠశాలకు దగ్గరగా ఉన్న ఓ మాల్‌లో రిటైల్ సేల్స్ అసోసియేటివ్‌గా చేరాను. ఆ తర్వాత పలు రెస్టారంట్లు, బార్లలో వెయిటర్‌గా పని చేశాను. ఓ వస్త్ర దుకాణంలోనూ కొన్ని రోజులు పని చేశాను. అంతేకాదు లాటరీ టికెట్లూ అమ్మాను’ అని గుర్తు చేసుకుంది. డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చకున్న ఈ కెనడా భామ టెంపర్ చిత్రంలోని ప్రత్యేక గీతంతో టాలీవుడ్‌కి పరిచయమైంది. ప్రస్తుతం భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రంలో నటిస్తోంది.
జీవితపు లోతులు చూసి…
Related tags :