* ఎంపీ రఘురామకృష్ణరాజుకు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం ఆయనను అధికారులు గుంటూరు జైలుకు తరలించారు. రఘురామకృష్ణరాజుకు ఖైదీ నంబర్ 3468 కేటాయించారు. జైల్లోని పాత బ్యారక్‌లో ఒక సెల్‌ను అలాట్ చేశారు. రఘురామకు పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం గుంటూరు జిల్లా కోర్టులో మెడికల్ రిపోర్ట్‌ను సమర్పించింది. కాగా, పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసిన సంగతి విదితమే. ఈ కేసులో ఆయనపై ఎఫ్‌ఐఆర్ 12/2021 నమోదు చేశారు.
* కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న కారు ఇద్దరు మృతి ముగ్గురి కి తీవ్ర గాయాలు.అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం సమీపాన కల్వర్టును ఢీకొన్న కారు అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు.చింతామణి వాసులు పని నిమిత్తం అనంతపురం కు వచ్చి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం కల్వర్టు నెంబర్ 350.
* కడప జిల్లా మామిళ్లపల్లిలోని ముగ్గురాయి గనుల్లో ఇటీవల జరిగిన పేలుడు ఘటనలో అరెస్టయిన వైఎస్ ప్రతాప్ రెడ్డి కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. పులివెందులలోని ఆయన కార్యాలయంలో పోరుమామిళ్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందిని విచారించారు. పేలుడు పదార్థాలు ఎలా నిల్వచేస్తారు? ఎక్కడ నుంచి తెస్తారు? ఎవరికి విక్రయిస్తారు? ఇటీవల ఎవరెవరికి విక్రయించారు? తదితర వివరాలపై ఆరా తీశారు. మామిళ్లపల్లి క్వారీలో ఈ నెల 8న జరిగిన పేలుడు ఘటనలో 10మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈ నెల 11న వైఎస్ ప్రతాప్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
* నగరంలోని కుల్సుంపురా పీఎస్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. జియాగూడలోని వెంకటేశ్వరనగర్ కాలనీలోని ఐదు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. దుండగులు రూ.20 లక్షలు, 45 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి క్లూస్ టీమ్‌తో వెళ్లిన పోలీసులు ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.