కోవిద్ రెండో వేవ్‌తో అతలాకుతలం అవుతున్న తెలుగు రాష్ట్రాల్లో అమెరికా తెలుగు సంఘం ఆటా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగా ఆటా అధ్యక్షులు భువనేష్ బుజ్జాల, ఆటా ప్రెసిండెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని, జాయింట్ సెక్రెట్రీ రామాకృష్ణరెడ్డి ఆల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనిల్ బోద్దిరెడ్డి, బివోటీ సుధీర్ బండారి ఆధ్వర్యంలో కోవిడ్ డిజాస్టర్ హెల్ప్ సర్వీసెస్ విభాగాన్ని ప్రారంభించారు. ఈ విభాగం ఆధ్వర్యంలో మొదటివిడతలో అమెరికా నుంచి ఇండియాకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపిచారు. తెలుగు రాష్ట్రాల్లో దశల వారిగా అన్ని జిల్లా కేంద్రాలకు ఈ యూనిట్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కాన్సంట్రేటర్లను హైదరాబాద్ నుంచి వరంగల్, కరింనగర్, నిజామాబాద్, బాన్సీవాడా, అదిలాబాద్, నారాయణపేట్‌లలో పంపిణి చేయనున్నారు. అమెరికా తెలుగు సంఘం ఇండియా టీమ్ సహాకారంతో జిల్లా కేంద్రాలకు అందించేందుకు ఆటా కోఆర్డినేటర్లు కరకాల కృష్ణ రెడ్డి, లోహిత్ కుమార్, శ్రీనివాస్ బండారు, వెంకటేశ్వరరావు, నవీన్ తదితరులు సహకరిస్తారు.
తెలంగాణాలో ఆటా ఆధ్వర్యంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపిణి
Related tags :