తనతో పాటు తన చెల్లిని కూడా పెళ్లి చేసుకోవాల్సిందేనని వధువు పట్టుబట్టడంతో.. వరుడు ఒకే వేదికపై ఇద్దర్నీ వివాహమాడాడు. ఈ విచిత్ర ఘటన కర్ణాటకలోని కొలార్ జిల్లాలో మే 7న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 31 ఏండ్ల యువకుడికి 21 ఏండ్ల సుప్రియతో వివాహం కుదిరింది. మే 7న పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే సుప్రియ చెల్లి పుట్టుకతోనే చెవిటి, మూగ. దీంతో పెళ్లికి ముందే సుప్రియ కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. మూగ, చెవిటి అయిన తన చెల్లిని ఎవరు కూడా పెళ్లి చేసుకోరని, నువ్వే ఆమెను కూడా వివాహమాడాలని తనకు కాబోయే వరుడిని సుప్రియ డిమాండ్ చేసింది. చేసేదేమీ లేక అతను ఒప్పేసుకున్నాడు. అనుకున్న ముహుర్తానికి ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఆ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసుల దాకా చేరింది. సుప్రియ సోదరి వయసు 16 ఏండ్లు కావడంతో.. పెళ్లి చేసుకున్న యువకుడితో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నూతన వరుడు ఉమాపతిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ ఘటన ఆదివారం వెలుగు చూసింది.
వధువు కోరిక మేరకు రెండు పెళ్లిళ్లు. పోలీసుల కస్టడీలో వరుడు.
Related tags :