బాలీవుడ్ స్టార్ నాయిక కత్రినా కైఫ్ కోలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది. విజయ్ సేతుపతికి జోడీగా తమిళంలో ఓ సినిమా చేస్తోంది. ‘అంధాధూన్’ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. రమేష్ తౌరుని నిర్మాత. ఈ సినిమాకి ‘మెర్రీ క్రిస్మస్’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి ఆ టైటిల్‌నే ఖరారు చేసినట్లు చిత్ర నిర్మాత ఓ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్రీకరణకు సంబంధించిన మరిన్ని విషయాలు పంచుకున్నారు. ‘‘ఈ ఏడాది ఏప్రిల్‌లోనే చిత్రీకరణ మొదలు కావాల్సింది. కరోనా ఉద్ధృతి వల్ల ఆ షెడ్యూల్ వాయిదా పడింది. జూన్‌లో షూట్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం దేశంలో చాలా వరకు లాక్‌డౌన్‌లో ఉన్నందున ఇంకా తేదీ ఖరారు చేయలేదు. చెన్నైలోనే ఓ మారథాన్ షెడ్యూల్ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. దీంట్లో విజయ్, కత్రినాతో పాటు మిగిలిన ముఖ్య తారాగణం పాల్గొంటారు. అలాగే పుణె, గోవాల్లోనూ కొంత చిత్రీకరణ చేస్తాం’’ అని నిర్మాత రమేష్ తెలియజేశారు. ఈ సినిమాని ఓ లఘు చిత్రం స్ఫూర్తితో తెరకెక్కించనున్నట్లు సమాచారం. విరామం లేకుండా 90నిమిషాల నిడివి గల చిత్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
సేతుపతితో కత్రినా
Related tags :