Politics

అమిత్ షాతో రఘురామ కుమారుడి భేటీ

అమిత్ షాతో రఘురామ కుమారుడి భేటీ

నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంతో ఏపీలో రాజకీయం మరింత వేడెక్కుతోంది. తాజాగా ఈ వ్యవహారం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చేరింది. తాజాగా ఆయన కుమారుడు భరత్‌, కుమార్తె ఇందు ప్రియదర్శిని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. తన తండ్రిని జగన్‌ ప్రభుత్వం వేధిస్తోందని, ఆయనపై అక్రమ కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. ఆయనను అరెస్ట్‌ చేయడం, ఆయనపై రాజద్రోహం కేసు మోపడం వెనుక కుట్ర ఉందంటూ ఫిర్యాదు చేశారు.