Health

నెల్లూరు ఆయుర్వేద మందుకు ప్రభుత్వం పచ్చజెండా-TNI బులెటిన్

నెల్లూరు ఆయుర్వేద మందుకు ప్రభుత్వం పచ్చజెండా-TNI బులెటిన్

* హీరో మంచు మనోజ్‌ తన సేవాగుణాన్ని చాటుకుంటున్నారు. కొవిడ్‌-19 కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సాయం అందించేందుకు ఆయన ముందుకొచ్చారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్లు వాడాలని, ఇంటి పట్టునే ఉంటూ కుటుంబ సభ్యుల్ని రక్షించుకోవాలని ఆయన కోరారు.

* నెల్లూరు కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేద మందుపై జిల్లా అధికారుల నివేదిక. కృష్ణపట్నం ఆయుర్వేదానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. రేపటి నుండి మందు అందుబాటులోకి వచ్చే అవకాశం నిబంధనలు పాటిస్తూ ఇవ్వాలని ఆదేశం.

* కార‌వ్యాన్ డ్రైవ‌ర్ కిలారి జయరామ్ కరోనా సోకి మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కు భార్య కె.శోభారాణి .. ఒక కుమార్తె వినోదిని (8) ఇద్ద‌రు కుమారులు కౌశిక్ (18), జ‌స్వంత్(12) ఉన్నారు. జయరామ్ మృతి ఆ కుటుంబాన్ని తీవ్ర క‌ల‌త‌కు గురి చేసింది. అనంత‌రం జయరామ్ కుటుంబాన్ని మెగాస్టార్ ఆదుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి అత‌డి కుటుంబానికి లక్ష రూపాయల చెక్ ని పంపించారు. జయరామ్ భార్య శోభ వారి పిల్ల‌లు చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ కి వ‌చ్చి చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు ర‌వణం స్వామినాయుడు చేతుల‌మీదుగా ఈ చెక్ ని అందుకున్నారు.

* కరోనా టెస్టుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ టెస్టింగ్ సెంటర్ లకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెస్టింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్టింగ్ కిట్ ను ప్రజలకు అందుబాటు ధరలో మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ (ఋఆట్) ధరను రూ.250గా నిర్ణయించింది. ఈ కిట్ తో 15 నిమిషాల్లో కరోనా సోకిందో లేదో తెలుసుకోవచ్చు.

* ఏపీలో కరోనాతో పాటు మరణాలు కూడ ఉధృతంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా రాష్ట్రంలో కొత్తగా 22,610 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో 114 మంది మృతి చెందారు. ఏపీలో ప్రస్తుతం 2,09,134 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ఏపీలో కరోనా నుంచి 23,098 మంది బాధితులు కోలుకున్నారు. ఏపీలో 24 గంటల వ్యవధిలో 1,01,281 కరోనా పరీక్షలు చేశారు. వైరస్‌ పట్టణాల నుంచి పల్లెలకు వ్యాపించింది. కొన్ని మారుమూల మండలాల్లోనూ రోజుకు వంద కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా పట్టణ ప్రాంతంలో కంటే గ్రామీణ ప్రాంతంలో కొవిడ్‌ పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. అయినా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడం వైద్య ఆరోగ్య శాఖను ఆందోళనకు గురి చేస్తోంది.