* ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా సిల్గేర్ కాల్పుల ఘటనకి నిరసనగా ఈనెల 21న సుక్మా, బీజాపూర్ జిల్లాల బంద్‌కి మావోయిస్టులు పిలుపునిచ్చారు.ఆ మేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య దక్షిణ సబ్‌జోనల్ బ్యూరో పేరుతో ప్రకటన విడుదల చేశారు.సిల్గేర్‌లో పెట్టిన సీఆర్‌పీఎఫ్ క్యాంపు ఎత్తివేయాలని ప్రజలు చేపట్టిన ఆందోళనలో చోటుచేసుకున్న కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.వారు మావోయిస్టు సభ్యులని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు.ఈ ఘటనని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది.సిల్గేర్ క్యాంపు ఎత్తివేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపి ముగ్గురి ప్రాణాలు పోవడానికి కారణమైన పోలీసు అధికారులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు.
* వన్ టౌన్ YMHA HALL వద్ధ ఉన్న సాయి తిరుమల ట్రేడర్స్ రైస్ షాప్ లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచుతున్నట్లు అందిన సమాచారం మేరకు జిల్లా విజిలెన్స్ ఎస్పి వరదరాజులు ఆదేశాల మేరకు .విజిలెన్స్ సీ.ఐ విల్సన్ మరియు సివిల్ సప్లై అధికారులు నిర్వహించిన దాడులలో ఐదు టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీన పరచుకుని క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఐదు టన్నుల పీ.డీ.ఎస్.రైస్ మరియు బస్తాలను కుట్టే స్త్రిట్చింగ్ మిషన్లు, దారాలను, ఎలక్ట్రిక్ కాటను స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్ సీ.ఐ విల్సన్ తెలిపారు.
* ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లక్ష్మీ నగర్ గ్రామం వద్ద ఆటో లారీ ఢీ కొని తండ్రి కొడుకు మృతి చెందారు ఏన్కూరు మండల కేంద్రంలో రోడ్డు ప్రక్కన జాడీలు కుండలు చిరువ్యాపారం నిర్వహిస్తున్న గెల్లి వెంకటేశ్వర్లు తన కుమారుడు రవీందర్తో కలిసి ఏన్కూరు నుండి ట్రాలీ ఆటోలో తన స్వగ్రామం మండాలపాడు గ్రామానికి వెళ్తుండగా తల్లాడ మండలం లక్ష్మీనగర్ గ్రామం వద్ద ఏన్కూరు వైపు వెళ్తున్న లారీ అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదంలో కుమారుడు రవీందర్ అక్కడికక్కడే మృతిచెందాడు తీవ్ర గాయాలపాలైన వెంకటేశ్వర్లును అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు సంఘటనా స్థలాన్ని వైరా సీఐ వసంత్కుమార్ తల్లాడ ఎస్ఐ నరేష్ ట్రైనీ ఎస్ఐ సూరజ్ పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు మృతునికి భార్య మరో కుమారుడు ఉన్నారు కరోనా కారణంగా లాక్డౌన్ విధించటంతో తమ స్వగ్రామానికి వెళుతున్నామని ఇంతలోనే ఘోరమైన ప్రమాదం జరిగిందని బోరున విలపించింది.
* తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కాంటాలు వేసిన బస్తాలను మిల్లులకు తరలించాలని నినాదాలు చేశారు.ఈ విషయం పై రైతులు మాట్లాడుతూ……కొనుగోలు కేంద్రాల కు ధాన్యం ను తీసుకొని వచ్చి 20 గడుస్తున్నా కాంటాలు కావడం లేదని,కాంటాలు వేసిన బస్తాలను మిల్లులకు తరలించడం లేదని , అకాల వర్షాలకు ధాన్యం,కాంటాలు వేసిన బస్తాలు తడిసిముద్దయి, మొలకలు వచ్చాయని ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కాంటాలు వేసిన బస్తాలను మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఆత్మహత్య లే శరణ్యమని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
* ప.గో. జిల్లా పెదవేగి మండలం నడిపల్లి పంచాయతీ ఇసుక ర్యా0ప్ నుండి నెల రోజులుగా లక్షలాది రూపాయల ఇసుక అక్రమంగా తరలిపోతుంద నే ఆరోపణలు గ్రామం లో వెల్లు వెత్తుతున్నాయి .పంచాయతీలో పనిచేసే ఒక ఉద్యోగి కలెక్టర్ కార్యాలయం ముసుగులో ఇసుకను తరలించే కొన్ని ట్రాక్టర్ లకు పంచాయతీ స్తాంప్ వేసి పర్మిట్ రసీదులు ఇస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షలాది రూపాయల ఇసుక అక్రమ రవాణా వెనుక పంచాయతీ లో ఒక ప్రభుత్వ ఉద్యోగి పాత్ర స్పష్టంగా ఉందని గ్రామస్తులు తెలుపుతున్నారు .ఈ ఉద్యోగి పంచాయతీకి వివిధ అవసరాల నిమిత్తం వచ్చే కొన్ని వర్గాలను కించ పరుస్తున్నట్టు కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఉద్యోగికి అహంభావం తో పాటు కుల వివక్షత కూడా ఎక్కువే ననీ కొంత మంది బలహీన వర్గాలు ఆవేదన చెందుతున్నట్టు తెలిసింది.నేన చెప్పిందే వేదం నా మాట శాసనం అన్నట్టుగా వ్యవహరించడం తో ఈ ఉద్యోగి వ్యవహారం గ్రామ ప్రజలకు తలనొప్పిగా మారిందని సామాన్యులు విద్యావంతులు.తలలు పట్టుకొంటున్నారని విశ్వసనీయ సమాచారం.విధులకు సక్రమంగా రారని .వారానికో .పడిరోజులకో ఒకసారి వచ్చినా ప్రజలకు జవాబు చెప్పే విధానం కూడా సక్రమంగా ఉండదని కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామస్తుల నోళ్లు మూయించి బయట వ్యాపారులతో చేతులు కలిపిరాత్రి వెళల్లోనూ.తెల్లవారు జామున ట్రాక్టర్ల పై ఇసుకను తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.