Sports

మిల్కా సింగ్‌కు కోవిద్

మిల్కా సింగ్‌కు కోవిద్

ఫ్లయింగ్‌ సిఖ్‌గా పేరుగాంచిన దిగ్గజ అథ్లెట్‌ మిల్కా సింగ్‌ కోవిడ్‌ బారిన పడ్డారు. ఇటీవల ఇంట్లో పని చేసే సహాయకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అతను పరీక్షలు చేయించుకున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్న మిల్కా పరిస్థితి నిలకడగానే ఉందని అతని భార్య నిర్మల్‌ కౌర్‌ తెలిపారు. కాగా, మిల్కా వయస్సు 91 ఏళ్లు కావడంతో ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.