ScienceAndTech

హైఫై మాస్క్‌ అంటే ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి?

హైఫై మాస్క్‌ అంటే ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి?

హై లెవెల్‌ ఫిల్టరేషన్‌, హై ఫిట్‌ మాస్క్‌లను హైఫై మాస్కులు అని పిలుస్తారు. మనం మాట్లాడేటపుడు, గాలి పీల్చేటపుడు అతి చిన్న పార్టికల్స్‌ బయటకు వస్తాయి. ఆ పార్టికల్స్‌లో వైరస్‌ ఉంటే అది ఇతరులకు వ్యాపిస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో కన్నా ఇండోర్‌లలో వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో హై ఫిల్టరేషన్‌, హైఫిట్‌ మాస్క్‌లను వాడటం వల్ల వైరస్‌ వ్యాపించకుండా ఉంటుంది. బట్టతో చేసిన మాస్క్‌ పెద్ద పార్టికల్స్‌ని మాత్రమే అడ్డుకోగలవు. 1 నుంచి 10 మైక్రాన్‌ సైజులో ఉన్న పార్టికల్స్‌ను బట్ట మాస్క్‌ అడ్డుకోలేదు. హైఫై మాస్క్‌లో ఉన్న ఎలక్ట్రోస్టాటికల్ చార్జ్‌ ఫిల్టర్‌ ఆ చిన్న చిన్న పార్టికల్స్‌ను సమర్థంగా అడ్డుకుంటుంది.