Politics

రఘురామ బెయిల్ ఏమవుతుందో?

రఘురామ బెయిల్ ఏమవుతుందో?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. న్యాయమూర్తులు వినీత్‌ శరణ్‌, వీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఇదిలా ఉంటే రఘురామ బెయిల్‌కి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో రఘురామ ఆరోగ్య నివేదికను తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ పంపారు.