Politics

ఏపీ ఎన్నికల కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం

ఏపీ ఎన్నికల కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏపీ ఎన్నికల కమిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

సుప్రీంకోర్టు తీర్పును తమకు కావాల్సినట్టుగా ఏపీ ఎన్నికల కమిషన్ అన్వాయించుకుందని పేర్కొంది.

చదవటం, అవగాహన చేసుకోవటంలో వైఫల్యం చెందారని సుప్రీంకోర్టు తీర్పును ఇలా అన్వాయించుకోవటం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.

సుప్రీంకోర్టు తీర్పులో నాలుగు వారాల సమయం ఇవ్వాలని స్పష్టంగా ఉందని పేర్కొంది.

చదవటం, రాయటం, ఇంగ్లీష్ భాషపై అవగాహన ఉన్న సామాన్యుడికి కూడా సుప్రీంకోర్టు తీర్పు అర్థమవుతుందని హైకోర్టు తెలిపింది.

కానీ ఏపీ ఎన్నికల కమిషనర్.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా గతంలో పనిచేశారని.. ఆమె సుప్రీంకోర్టు తీర్పును సరైన దృక్పధంలో అర్థం చేసుకోకపోవటం ఆశ్చర్యాన్ని కల్గించిందని పేర్కొంది.

ఇటువంటి తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆమె అర్హతపై ఆలోచించాల్సి వస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆమె ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారని… సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఆమె వ్యవహరించారని మండిపడింది.

సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఏప్రిల్ 1న ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి 10న కౌంటింగ్ ఎలా జరుపుతారని హైకోర్టు ప్రశ్నించింది.

ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధమని, ఇటువంటి చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలు పడిపోతాయని ఏపీ హైకోర్టు పేర్కొంది.