* ఈరోజు కలెక్టర్ ఉత్తర్వుల మేరకు మందులు పంపిణీ నిలిపివేయడం జరిగినదని ఎవరు కూడా కృష్ణపట్నం రావద్దని సంబంధిత అధికారులు తెలిపారు. డాక్టర్,, అనందయ్య ను హౌస్ అరెస్టు చేయడం జరిగిందని కొన్ని వేల మంది మందు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేదాకా ఆయుర్వేద మందులు ఆపేస్తున్నామని అనందయ్య తెలిపారు.!
* నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెలిప్యాడ్ వద్ద మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్ సీఎంకు స్వాగతం పలికారు.అనంతరం కేసీఆర్ నేరుగా ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
* నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఆయుర్వేదం కోవిడ్ మందుపై సందిగ్ధత కొనసాగుతోంది.ఆయుర్వేదం మందు కోసం పలు ప్రాంతాల నుంచి వేలాది మంది జనం తరలివస్తున్నారు.పలు ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ చేసి ఆక్సిజన్ పెట్టుకుని మరీ కోవిడ్ రోగులు ముత్తుకూరుకు వస్తున్నారు.ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా వద్దా అనే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి సారించారు.ఆయుర్వేదం మందు పంపిణీ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కాసేపట్లో సీఎం సమీక్ష చేయనున్నారు.ఉన్నతాధికారులతో సమావేశమై ఆయుర్వేదం మందు శాస్త్రీయత, పనిచేసే విధానాన్ని తెలుసుకోనున్నారు.ఇప్పటికే అధికారుల బృందం చేసిన పరిశీలన, నివేదికపై సీఎం చర్చించనున్నారు.ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా వద్దా అనే అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
* దేశంలో కరోనా మహమ్మారి నిత్యం వేలమందిని బలితీసుకోవడంపై ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.కొవిడ్ పరిస్థితులపై నేడు ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.__ఉత్తరప్రదేశ్‌లోని తన లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసికి చెందిన డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలతో ప్రధాని మోదీ నేడు వర్చువల్‌గా సమావేశమయ్యారు.
* కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవటంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నగరం గొప్ప ఉదాహరణగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
* దేశంలో కరోనా మహమ్మారి మృత్యుఘోష కొనసాగుతోంది. కొత్త కేసులు తగ్గుతున్నా మరణాలు మాత్రం తగ్గటం లేదు. శుక్రవారం మళ్లీ 4 వేలపైనే మృతి చెందారు.దేశంలో కొత్తగా 2,59,591 కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారినపడిన వారిలో మరో 4,209 మంది చనిపోయారు. కొవిడ్ సోకిన వారిలో మరో 3,57,295 మంది కోలుకున్నారు.మొత్తం కేసులు: 2,60,31,991.మొత్తం మరణాలు: 2,91,331.మొత్తం కోలుకున్నవారు: 2,27,12,735.యాక్టివ్ కేసులు: 30,27,925.