DailyDose

రఘురామకు బెయిల్-నేరవార్తలు

రఘురామకు బెయిల్-నేరవార్తలు

* ఎంపీ రఘురామకృష్ణ రాజుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు.ఎంపీ తరఫున ముకుల్‌ రోహత్గీ, ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు.ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్‌ను మంజూరు చేసింది.ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్‌రే, వీడియో కూడా పంపారని ధర్మాసనం తెలిపింది.ఎంపీకి జనరల్‌ ఎడిమా ఉందని, ఫ్రాక్చర్ కూడా అయినట్లు నివేదికలో ఉందన్నారు.ఆర్మీ ఆస్పత్రి వైద్యుల బృందం సమర్పించిన నివేదికను సుప్రీం పరిశీలించింది.

* ధూళిపాళ్ల నరేంద్రకుమార్ బెయిల్ పిటీషన్ పై ముగిసిన వాదనలు. తీర్పు సోమవారం అనగా 24 మే 2021 ఉదయం 10:30 నిమిషాలకు చెప్పనున్న న్యాయమూర్తి.

* *హైద‌రాబాద్ వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధ‌న‌లను అమ‌లు చేసేందుకు పోలీసులు రోడ్ల‌పై బారీకేడ్లు ఏర్పాటు చేసి త‌నిఖీలు చేస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు కచ్చితంగా పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తాజాగా ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు మ‌రింత అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ రోజు దిల్‌సుఖ్‌న‌గ‌ర్ త‌నికీ కేంద్రాన్ని ప‌రిశీలించిన హైద‌రాబాద్ సీపీ అంజ‌నీ కుమార్ మీడియాతో మాట్లాడారు.

* కృష్ణాజిల్లా పెడన మండలంలో విషాదం. తీవ్ర విషాదం నింపిన దంపతుల ఆత్మహత్య. కరోనా పాజిటివ్ వచ్చిందని ఆవేదన లో దంపతుల ఆత్మహత్య.
మృతులు జక్కుల లీలా ప్రసాద్, భారతి.

* కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీసు స్టేషన్ ఆవరణలో ప్రేమజంట శానిటైజర్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు మైనర్లు కావడంతో ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరణ ఇంట్లో నుంచి పారిపోయి రీసెంట్‌గా పెళ్లి చేసుకున్నారు. ఇవాళ సదరు ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. అయితే అబ్బాయిపై అమ్మాయి కుటుంబ సభ్యులు కిడ్నాప్ కేసు పెట్టారు. దీంతో మనస్తాపానికి గురై ప్రేమజంట శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.