* HYD నగర వ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో బాయ్స్ వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.ఎల్బీ నగర్, ఖైరతాబాద్, ప్యాట్నీ చౌరాస్తా పలు ప్రాంతాల్లో వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు.ఫుడ్ డెలివరీ కోసం వస్తే వాహనాలు సీజ్ చేస్తున్నారని వాపోయారు.డెలివరీ ఆపేయాలని తమ సంస్థల నుంచి సమాచారం లేదని పోలీసులకు చెప్పినా వినడం లేదని అంటున్నారు.ముందుగా సమాచారం ఇస్తే తాము రోడ్ల మీదకు వచ్చే వాళ్ళమే కాదని… అనవసరంగా తమను ఇబ్బందుల పాల్జేస్తున్నారని చెబుతున్నారు.
* విశాఖ…విమ్స్ లో వ్యక్తి ఆత్మహత్య.
* ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు కాపీ విడుదల చేసింది. తీర్పు కాపీని లాయర్లు ఆర్మీ ఆస్పత్రికి అందజేశారు.
* తన ఇంటి బయట కూరగాయలు విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు లాక్కెళ్లి విచక్షణ రహితంగా కొట్టారు. ఫలితంగా అతడు మరణించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలోని బంగర్‌మవు పట్టణంలో జరిగిందీ ఘటన.
* కంచికచర్ల అంబేద్కర్ కాలనీ లో గ్యాస్ సిలిండర్ పేలి రేకుల షెడ్డు దగ్ధం. ఇంటి బయట ఉన్న భార్య భర్త పిల్లలు. ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో దిగ్భ్రాంతికి గురైన స్థానికులు.