నివారం నల్గొండలో పోలీసులు ఇంకాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్లపైకి వచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. రోడ్డుపై కనపడిన వారిని కనపడినట్లు లాఠీలతో కొట్టారు. ఈ నేపథ్యంలో ఓ విద్యుత్ ఉద్యోగిపై దాడి చేయటంతో ఆ సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో సరఫరా అవుతున్న విద్యుత్‌ను నిలిపేసి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కేవీ రంగనాథ్.. విద్యుత్ ఎస్‌సీ కృష్ణయ్యతో మాట్లాడి సమస్యను పరిష్కరించడంతో మధ్యాహ్నం సుమారు 2గంటలకు విద్యుత్ పునరుద్ధరించారు. దీంతో సమస్య సద్దుమణిగింది. మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి వెళ్లడంతో విద్యుత్ ఉద్యోగులకు పాస్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మూడున్నర గంటల పాటు విద్యుత్ లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగులు ఇబ్బంది పడ్డారు. దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ సమాధానమిచ్చారు.
విద్యుత్ ఉద్యోగుల షాక్ రుచి చూసిన నల్గొండ పోలీసులు
Related tags :