కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో కరోనా బాధితులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఇదే గ్రామానికి చెందిన ప్రవాసుడు, తానా కోఆర్డినేటర్ కసుకుర్తి రాజా సహకారంతో కరోనా నివారక మందుల కిట్లను పంపిణీ చేశారు. వీరవల్లి గ్రామ సర్పంచ్ పిల్లా అనిత ఈ కిట్లను స్థానికులకు పంపిణీ చేశారు. ఈ కిట్లను గ్రామంలోని వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ANMల ద్వారా కరోనా బాధితులకు అందజేస్తారు. పరిసర గ్రామాలైన కోడూరుపాడు, రేమల్లే, వేలేరు, మడిచర్ల, కాకులపాడు, దంటగుంట్ల, తిప్పనగుంట,బడారుగూడెం గ్రామాల ప్రజలకు కూడా వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్యామల రావు, గ్రామ ప్రముఖులు గుండపనేని ఉమా వరప్రసాద్, కలపాల శ్రీధర్(రాజబాబు),మాజీ సర్పంచ్, ప్రస్తుత పాలకవర్గ సభ్యులు పిల్లా రామారావు, వార్డు సభ్యులు, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
వీరవల్లి గ్రామంలో తానా కరోనా మందుల కిట్ల పంపిణీ
Related tags :