Sports

కవితకు WWE ఉద్వాసన

కవితకు WWE ఉద్వాసన

కవితది హరియాణాలోని జింద్‌ జిల్లా మాల్వీ గ్రామం. అసలు పేరు కవిత దలాల్‌. చిన్నప్పటి నుంచి కుస్తీ పోటీల్లో పాల్గొని చివరికి వ్వే లాంటి ప్రపంచ ప్రఖ్యాత ప్రొఫెషనల్‌ పోటీల్లో రెజ్లర్‌గా ఎదిగింది. 2017లో అక్కడికి వెళ్లిన తర్వాతే ఆమెకు గుర్తింపు దక్కింది. అక్కడ కొద్ది నెలలు శిక్షణ పొందిన ఆమె తర్వాత లైవ్‌ ఈవెంట్లలో పాల్గొని భారత అభిమానులను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ‘కవిత దేవి’గా రింగ్‌ పేరుతో బరిలోకి దిగి ప్రత్యేక గుర్తింపు సాధించింది. అలా ప్రపంచ రెజ్లింగ్‌ పోటీల్లో భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా రెజ్లర్‌గా కవిత రికార్డు నెలకొల్పింది. అంతకుముందు ‘ది గ్రేట్‌ ఇండియన్‌ రెజ్లర్‌ ఖలీ’ వద్ద శిక్షణ పొందింది.