Health

టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ-TNI కోవిద్ బులెటిన్

Huge Traffic Jam At AP-TS Border

* షాద్ నగర్ లో లాక్ డౌన్ మరింత కఠినం…అనవసరంగా బయటకు వస్తే వాహనాలు సీజ్ సీఐ నవీన్ కుమార్.అనవసరంగా బయటకు వస్తే వాహనాలు సీజ్ చేస్తామని సీఐ నవీన్ కుమార్ హెచ్చరించారు.ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఏసీపీ కుశలకర్ ఆదేశాల మేరకు సీఐ నవీన్ ఆధ్వర్యంలో ఎస్సై సురేష్,సిబ్బంది ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహించారు.అనుమతి లేని వాహనాలను సీజ్ చేశారు.ఈ సందర్భంగా సీఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ…ఎవరైనా అనుమతులు లేకుండా బయటకు వస్తే వాహనాలు సీజ్ చేసి,వారిపై కేసు కూడా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ లాక్ డౌన్ నిబంధనాల ప్రకారం అనుమతులు ఉన్న వారు తమ వెంట తమ ఐడి కార్డ్ తెచుకోవాలని సూచించారు.

* ఆయేర్వేద వైద్యుడు ఆనందయ్య మందుపై దుష్ప్రచారం వద్దని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

* తెలంగాణలో కర్ఫ్యూ నిబంధనలు కఠినం చేసిన అధికారులు.ఈ పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి.అంబులెన్స్ లకు మినహాయింపు.కర్ఫ్యూ సడలింపు సమయంలోను పొరుగు రాష్ట్రాల ప్రయాణికులకు అనుమతి నిరాకరణ.ఆఫ్ సరిహద్దుల్లో భారీగా నిలచిన ప్రయాణికుల వాహనాలు.

* కొవిడ్ నుంచి స్వల్ప ఊరట కలిగే వార్త! దేశంలో రోజువారి మరణాల సంఖ్య నాలుగు వేల లోపునకు పరిమితమైంది.గడిచిన రెండు రోజులుగా 4 వేలకు పైగా మృత్యువాత పడుతుండగా.. శనివారం 3,741 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.మరోవైపు కొత్త కేసుల సంఖ్య రెండున్నర లక్షల లోపునకు పరిమితమైంది.2,40,842 మందికి శనివారం కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 65లక్షలు దాటింది.మొత్తం కేసులు: 2,65,30,132.మొత్తం మరణాలు: 2,99,266.రికవరీలు: 2,34,25,467.యాక్టివ్ కేసులు: 28,05,399.

* పుల్లూర్ టోల్ ప్లాజా దగ్గర భారీగా నిలిచిన వాహనాలు. ఈ పాస్ ఉన్న వారిని,నిత్యావసర వాహనాలను పంపుతున్నారు. మిగితా వాహనాలు అన్ని అక్కడనే వున్నాయి.

* అనంతపురం జిల్లా…రాప్తాడు మండల తహసీల్దార్ శివయ్య కరోనాతో మృతి.