Agriculture

నేడు రైతుల ఖాతాల్లోకి ఖరీఫ్ బీమా

నేడు రైతుల ఖాతాల్లోకి ఖరీఫ్ బీమా

గతేడాదికి సంబంధించిన ఖరీఫ్‌ పంటల బీమా సొమ్మును ప్రభుత్వం ఇవాళ రైతుల ఖాతాల్లో జమచేయనుంది.

సీఎం జగన్ బటన్ నొక్కటంతో 15.15లక్షల రైతుల ఖాతాల్లో 1820.23 కోట్లు జమకానున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై పైసాభారం లేకుండా ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని అన్నారు.

డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం ద్వారా 21రకాల పంటలకు, వాతావరణం ఆధారంగా 9 రకాల పంటలకు కలిపి 35.75లక్షల హెక్టార్లకు బీమా కల్పించామన్నారు.

37.25 లక్షల మంది రైతులను బీమా పరిధిలోకి తెచ్చినట్లు పేర్కొన్న మంత్రి కన్నబాబు నోటిఫైడ్‌ చేసిన పంటలను సాగుచేసిన రైతుల వివరాలను ఈ-పంట ద్వారా నమోదు చేసినట్లు వెల్లడించారు.