కరోనా వైరస్ థర్డ్ వేవ్ చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటూ వస్తున్న వార్తలపై ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. థర్డ్ వేవ్‌లో చిన్న పిల్లలు ఈ మహమ్మారి బారినపడతారన్న దానికి సరైన ఆధారాలేవీ లేవన్నారు. నిజానికి కరోనా బారినపడుతున్న చిన్నారులు అతి తక్కువని, గణాంకాలు కూడా అదే విషయాన్ని చెబుతున్నాయన్నారు. దీని వెనక ఓ కారణం కూడా ఉందన్నారు. ఏస్ రెసెప్టార్స్ (గ్రాహకాలు) ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని, పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఇవి చాలా తక్కువని గులేరియా వివరించారు.
చిన్నారులపై కరోనా ప్రభావంలో నిజం ఎంత?
Related tags :