నిన్నటితో 81 ఏట అడుగుపెట్టిన నటుడు చంద్రమోహన్ ఇక సినిమాలకు స్వస్తిపలికారు! 55 ఏళ్ళు నటించానని, రాఖీ సినిమా షూటింగ్లో గుండెనొప్పి రావడంతో బైపాస్ సర్జరీ జరిగిందని, దువ్వాడ జగన్నాధం షూటింగ్లో కూడా ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడ్డానని అయన గుర్తు చేసుకున్నారు. వంశీ గ్లోబల్ అవార్డ్స్, ఇండియా, సంతోషం ఫిలిం న్యూస్, శ్రీమతి శారద ఆకునూరి సంయుక్త ఆధ్వర్యంలో శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు ఆధ్వర్యంలో జూమ్లో ఈనెల 22 నుంచి రెండు రోజులపాటు చంద్రమోహన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 14 దేశాల నుంచి 108 మంది రచయితలు పాల్గొని, చంద్రమోహన్ నటించిన 108 సినిమాల గురించి, వారి నటనా వైదుష్యం గురించి విశ్లేషించారు.
సినిమాలకు చంద్రమోహన్ వీడ్కోలు
Related tags :