Politics

లాక్‌డౌన్‌పై కేసీఆర్ సమీక్ష

లాక్‌డౌన్‌పై కేసీఆర్ సమీక్ష

రాష్ర్టంలో క‌రోనా లాక్‌డౌన్‌, వ్యాక్సినేష‌న్‌తో పాటు ఇత‌ర అంశాల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి మంత్రి హ‌రీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ సీపీల‌తో పాటు వైద్యారోగ్య శాఖ ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. మొద‌ట‌గా ఫ్రంట్ లైన్ వారియ‌ర్ల‌కు టీకా ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌నున్న‌ట్టు స‌మాచారం. జ‌ర్న‌లిస్టులు, గ్యాస్ బాయ్స్, కూర‌గాయ‌ల వ్యాపారుల‌తో పాటు చిరు వ్యాపారుల‌కు టీకా ఇచ్చే విష‌యంపై సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త ప‌ది రోజుల నుంచి రాష్ర్టంలో టీకా పంపిణీ కార్య‌క్ర‌మం ఆగిన విష‌యం తెలిసిందే. ఇక లాక్‌డౌన్‌ను అధికారులు ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తున్నారు. మే 30వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగ‌నుంది.