కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనీ, ఇలాంటి వారిని తమకు తోచిన విధంగా ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని హీరోయిన్ శృతిహాసన్ పిలుపునిచ్చింది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ‘లాభం’ చిత్రంలో నటించింది. అలాగే, తెలుగు, కన్నడ భాషల్లో కూడా మరికొన్ని ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అయితే, లాక్‌డౌన్ కారణంగా సినిమాల షూటింగులన్నీ ఆగిపోవడంతో ప్రస్తుతం ముంబైలోని తన సొంతింటిలో ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల వారిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను కూడా ఈమె సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేసింది. వీటిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినప్పటికీ.. వీటిగురించి ఏమాత్రం పట్టించుకోని శృతిహాసన్… ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడికీ వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. వివిధ దేశాలకు వెళ్ళాల్సిన ప్రయాణాలను కూడా రద్దు చేసుకున్నానని, మున్ముందు కూడా విదేశీ పర్యటనలు సాఫీగా, ఆరోగ్యవంతంగా సాగుతాయన్న నమ్మకం లేదని ఆమె పేర్కొంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చాలా మంది తీవ్రంగా నష్టపోయారని, అలాంటి వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేద్దామని శృతిహాసన్ పిలుపునిచ్చింది.
ప్లీజ్…సాయపడండి
Related tags :