ఇప్పుడైతే ఎన్ని ఫొటోలు కావాలంటే అన్ని గూగుల్ ఫొటోస్‌లోకి అప్‌లోడ్ చేసేస్తున్నాం. కానీ జూన్ 1 నుంచి ఈ ఆప్షన్ ఉండదు. ఎందుకంటే గూగుల్ ఫొటోస్‌లో హై క్వాలిటీ ఫొటోల అపరిమిత స్టోరేజీని ఆపేస్తోంది. దీంతో మనం ఎంత వాడుకోవాలన్నా 15 జీబీ లోపే. ఆపై స్టోరేజీ కావాలంటే కొనుక్కోవాల్సిందే. ఈ నేపథ్యంలో స్టోరేజీలో అనవసర ఫైల్స్ తీసేయాలి. దీనికేం చేయాలి, మరీ తీయలేనంత స్టోరేజీ ఉంటే ఏం చేయాలి! గూగుల్ స్టోరేజీలో అనవసరమైన ఫొటోలు/ వీడియోలు/ఫైల్స్ సులభంగానే చేసేయొచ్చు. దీని కోసం ముందుగా మీ మొబైల్‌లో గూగుల్ వన్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఆ యాప్‌లోని హోం పేజీలో స్టోరేజీ బాక్స్ ఉంటుంది. మొత్తంగా గూగుల్ ఇచ్చే ఉచిత 15 జీబీ స్టోరేజీలో మీరు ఎంత వాడారనేది ఆ బాక్స్‌లో చూపిస్తారు. గూగుల్ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్ ఎంతంతెంత స్టోరేజీ వాడింది అక్కడ ఉంటుంది. దాని కింద ఫ్రీ అప్ స్టోరేజీ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ గూగుల్ స్టోరేజీలో ఉన్న ఫైల్స్/వీడియోస్/ఫొటోలు కనిపిస్తాయి. అలా కనిపించిన వాటిలో మీకు ఏవైనా వద్దు అనుకుంటే. అక్కడ సెలక్ట్ చేసుకొని బల్క్‌గా డిలీట్ చేసేయొచ్చు. ఒకవేళ ఫ్రీఅప్ స్టోరేజీ కనిపించకపోతే స్టోరేజీ బ్లాక్‌లో చూపించే డ్రైవ్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్ పేర్లను క్లిక్ చేసి.. ఆయా సర్వీసులోకి వెళ్లి డిలీట్ చేసుకోవచ్చు. ఎంత తీసేసినా ఎక్కువే ఉంది అనిపిస్తే… వేరే మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని అందులోకి మీ స్టోరేజీని అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ గూగుల్ నుంచి అదనపు స్టోరేజీ కొనుక్కునే ఆప్షనూ ఉంది.
ఈ వారంతో గూగుల్ ఉచిత స్టోరేజీ బంద్
Related tags :