* కడప పట్టణంలో బుగ్గవంక నిర్వాసితుల ఆక్రోశం…నగరంలోని గుర్రాలగడ్డ వద్ద జేసిబితో ఇళ్ళు కూల్చివేస్తున్న ఏ.ఈ రఘునాధరెడ్డిపై దాడికి పాల్పడ్డ నిర్వాసితులు.
* కో-ఆపరేటివ్ సొసైటీ కాలనీలోని విజేత కాలేజీలో మూడురోజుల క్రిందట జరిగిన మర్డర్ కేసు లో ముద్దాయిలను అరెస్టు చేసిన పట్టణ పొలీసులు. బీరు తాగుతూ సిగిరెట్ ముట్టించుకోవటానికి అగ్గిపెటె ఇవ్వండి బ్రదర్ అని అడుగితే అది ఒకరి ప్రాణం తీసేంత తప్పుగా కనపడుతుందని తాగుతున్న బీరు బాటిల్ ని పగలకొట్టి జమీలుద్దీన్ కుత్తికలో పొడిచిన ముద్దాయి రాహుల్ . ఏరియా హస్పిటల్ లో జమీలుద్దీన్ మృతి. ,స్నేహితుడిని పొడుస్తున్నాడని అడ్డుకున్న పృద్వీ ని విన్సంట్ పొడబోగా పృద్వీ కి స్వల్పం గాయం కాగా నెల్లూరు లో చికిత్స పొందుతున్న పృద్వీ. పృద్వీ విన్సంట్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో. కో-ఆపరేటివ్ కాలనీలోని విజేత కాలేజీ లో జరిగిన జమీలుద్దీన్ హత్య కేసులో ముద్దాయిలను కావలి రెండవ పట్టణ సిఐ మల్లికార్జున రావు యస్సై అరుణ కుమారి లు తమ సిబ్బందితో కలసి అరెస్టు చేసి డియస్పీ ప్రసాదు ఎదుట హజరుపరచగా రిమాండ్ కు పంపుతున్నామని అలాగే ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన పృద్వీ నెల్లూరు లోని హస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని డియస్పీ ప్రసాదు తెలిపారు.
* విశాఖ జిల్లా సీలేరు నదిలో రెండు నాటుపడవలు మునిగాయి. ఈ ప్రమాదాల్లో 8 మంది గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యమైంది.
* గుజరాత్, ఆనంద్ నగర్లోని మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 80 గుడిసెలు దగ్ధమయ్యాయి.
* విశాఖపట్నం: హెచ్ పీ సీ ఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో సంస్థలోని ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రమాద సూచికలు తెలియజేస్తూ సంస్థ నిర్వాహకులు సైరన్ లు మోగించడం జరిగింది.