Editorials

ఈయనే CBI నూతన డైరక్టర్

ఈయనే CBI నూతన డైరక్టర్

సీబీఐ డైరెక్టర్‌గా సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం (డీవోపీటీ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1985 మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అయిన సుబోధ్‌కుమార్‌ రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. సీబీఐ డైరెక్టర్‌ నియామకంపై సోమవారం ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరితో కూడిన కమిటీ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో కమిటీ ముగ్గురు పేర్లను ఎంపిక చేసింది. చివరికి సుభోధ్‌ కుమార్‌ను ఖరారు చేసింది. ప్రస్తుతం జైస్వాల్‌ సీఐఎస్‌ఎఫ్‌ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.