Politics

వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు సవాల్

వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు సవాల్

”జ‌నార్దన్‌రెడ్డి కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఎలా వ‌ర్తిస్తుంది.? తెదేపా నేత అనుచ‌రుల‌ను పోలీస్ స్టేష‌న్‌లో పెట్టి కొట్ట‌డం నేరం. తెదేపా నేత‌ల‌ను అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. త‌ప్పు చేస్తే పోలీసులు కూడా జైలుకెళ్లే ప‌రిస్థితి వ‌స్తుంది. జ‌గ‌న్‌ను న‌మ్ముకున్న వాళ్లంతా ఇప్ప‌టికే జైలుకెళ్లి వ‌చ్చారు. ప్ర‌భుత్వాలు శాశ్వ‌తం కాద‌ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. వ‌డ్డీతో స‌హా చెల్లించే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది. మూడేళ్ల త‌ర్వాత మీ వెనుక ఎవ‌రోస్తారో నేనూ చూస్తా. 22 ఏళ్లు అధికారంలో ఉన్న మేము ఇలాగే చేశామా? మీరు బాధ‌ప‌డే రోజూ ద‌గ్గ‌ర్లోనే ఉంది” అని చంద్ర‌బాబు అన్నారు.