WorldWonders

పుత్తూరు కోతుల సోషల్ డిస్టన్సింగ్-TNI కోవిద్ బులెటిన్

పుత్తూరు కోతుల సోషల్ డిస్టన్సింగ్-TNI కోవిద్ బులెటిన్

* కోవిడ్ నిబంధనలు పాటించడం లో మనుషులకు ఆదర్శంగా నిస్తున్నాయి కోతులు. భౌతిక దూరం పాటిస్తూ ఆహారం తీసుకుంటున్న ఘటన పుత్తూరు మండలం కైలాసకోన పర్యాటక కేంద్రం వద్ద చోటు చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా పర్యాటక కేంద్రం మూతపడడంతో కోతులకు ఆహరం అందడం లేదు. దాంతో కోతులకు ఆహారం పెట్టడానికి సిద్ధపడింది కైలాసనాధ ఆలయ కమిటీ. కోతులు భౌతిక దూరం పాటించేలా రోడ్డుపై మార్కింగ్ చేసారు కమిటీ సభ్యులు. అయితే క్రమం తప్పకుండా ఆ మార్కింగ్ లో కూర్చొని ఆహారం తీసుకుంటున్నాయి కోతులు. కోతుల క్రమశిక్షణ చూసి సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

* క‌రోనా క్రైసిస్ చారిటీ సేవ‌ల తరవాత మెగాస్టార్ చిరంజీవి మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణా, ఏపీలోని అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకుల ఏర్పాటు ప్ర‌క్రియ పూర్త‌యింది. వారంలోగా ఈ ఏర్పాటు చేస్తామ‌ని మెగాస్టార్ ప్ర‌క‌టించిన‌ట్టే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా అభిమాన సంఘాల అధ్య‌క్షుల ఆధ్వ‌ర్యంలో ఈ ఆక్సిజ‌న్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఆక్సిజన్ పంపిణీ జ‌రిగింది. అనంత‌పూర్, గుంటూరు, శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ ప‌ట్నం, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల‌కు నేడోరేపో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు అందుబాటులోకి వ‌స్తాయి. బ్ల‌డ్ బ్యాంక్ నుంచి ఇప్ప‌టికే ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు కాన్స‌న్ట్రేట‌ర్లు పంపించారు. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో కూడా ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభమయ్యాయి. ప్రతి జిల్లాలలో ఆస్ప‌త్రి నుంచి ఆక్సిజ‌న్ కావాల‌ని కోర‌గానే నిర్వాహకులు బ్యాంకు నుంచి సిలిండ‌ర్ల‌ను పంపిస్తారు. అవ‌స‌రాన్ని బ‌ట్టి ఈ పంపిణీ ఉంటుంది.

* కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువ. ఎన్నో గిరిజన తెగలు ఆ అడవుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. సరైన రహాదారి, కనీస సౌకర్యాలు లేకపోయినా అడవి తల్లినే నమ్మకుని జీవిస్తున్నారు. అయితే ఇటీవల అట్టపడి టౌన్‌కి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న మురుగుల గ్రామస్తులు కరోనాతో బాధపడుతున్నట్టు స్థానిక వైద్యులకు సమాచారం అందింది. 

* జంతువుల‌పై మొద‌లైన ఆనంద‌య్య మందు ప‌రిశోధ‌న‌. మంగాపురం వ‌ద్ద యానిమ‌ల్ ల్యాబ్‌లో జంతువుల‌పై ప‌రిశోధ‌న‌. 14 రోజుల్లో నివేదిక రావోచ్చంటున్న తుడా చైర్మ‌న్ చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి.

* మన దేశంలో ప్రమాదకర బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 11,717 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. గుజరాత్ లో 2,859 కేసులు, మహారాష్ట్రలో 2,770, ఏపీలో 768 కేసులు నమోదయ్యాయి. మరోవైపు బ్లాక్ ఫంగస్ ను మహమ్మారిగా గుర్తించాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. గత శుక్రవారం ప్రధాని మోదీ మాట్లాడుతూ మన దేశానికి సరికొత్త సవాల్ గా బ్లాక్ ఫంగస్ అవతరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. నొప్పులు, కళ్లు, ముక్కు చూట్టూ ఎర్రబడటం, జ్వరం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తపు వాంతులు వంటివి బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా చెబుతున్నారు.