తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ ఒకటి. యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు రావు రమేశ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. నేడు రమేశ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో కళ్లద్దాలు పెట్టుకుని, కోటు ధరించి సీరియస్ గా కనిపించారు రమేశ్. ఈ చిత్రంలో ఆయన సీబీఐ అధికారి కన్నెగంటి రాఘవన్ పాత్రలో కనిపించనున్నారు. గతంలో ప్రశాంత్ నీల్- యశ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కేజీయఫ్ ఛాప్టర్ 1’ కి కొనసాగింపు ఈ చిత్రం. శ్రీనిధి శెట్టి నాయిక. రవీనా టాండన్, సంజయ్దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్స్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జులై 16న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
KGF2లో రావు రమేష్ లుక్ వచ్చేసింది
Related tags :