ట్విటర్ వేదికగా ప్రజల సమస్యలపై స్పందిస్తూ, వాటిని పరిష్కరించడంతోపాటు వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న మంత్రి కేటీ రామారావుకు శుక్రవారం ట్విటర్‌లో తోటకూర రఘుపతి అనే వ్యక్తి నుంచి వింత ఫిర్యాదు వచ్చింది. ‘‘కేటీఆర్ గారూ! నేను ఆన్‌లైన్‌లో చికెన్ బిర్యాని ఆర్డర్ చేశాను. అదనపు మసాలాతోపాటు లెగ్‌పీస్ పంపాలని కోరారు. అవేమీ రాలేదు. కావాలంటే ఈ ఫోటో చూడండి. ప్రజలకు ఇలాగేనా సేవలందించడం’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మంత్రి విస్మయం చెందారు. ‘‘ఈ విషయంలో నేనేం చేయగలను బ్రదర్. నా నుంచి నువ్వేం ఆశిస్తున్నావు’’ అని ప్రశ్నించారు. తర్వాత ఆ ట్వీట్‌ను కేటీఆర్ తొలగించారు.
బిర్యానీలో లెగ్ పీస్ రాలేదని కేటీఆర్‌కు ఫిర్యాదు
Related tags :