Movies

ఐశ్వర్య కాదు

ఐశ్వర్య కాదు

స్నేహ ఉల్లాల్‌ షేర్‌ చేసిన ఓ ఫోటో ఆమెను మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. బ్రైడల్‌ ఫోటో షూట్‌లో పాల్గొన్న స్నేహ ఉల్లాల్‌..నుదుట‌న పాపిట బిళ్ల‌, జుంకీలు, చేతి రింగ్‌తో అచ్చం జోధా అక్భర్‌లో ఐశ్వర్యరాయ్‌లా ఉంది. ఈ ఫోటోను స్నేహ ఉల్లాల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీంతో ఈ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. ఐశ్వర్యకు జిరాక్స్‌ కాపీలా ఉందే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. స్నేహ ఉల్లాల్‌ ఇటీవలె ‘ఎక్స్పైరీ డేట్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇటీవలె బ్యాక్‌లెస్‌ ఫోటోను షేర్‌ చేసి ఇది ‘నేను కాదు.. కానీ నేనే కావచ్చు’ అంటూ ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోను షేర్‌ చేసిన సంగతి తెలిసిందే.