* ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్ పరిధిలోని కర్సువాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 11మంది మృతిచెందారు. మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. ఒకే యజమానికి చెందిన రెండు దుకాణాల్లో బాధితులు మద్యం తాగినట్టు గుర్తించిన అధికారులు….ఆ దుకాణాలను సీజ్ చేశారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
* అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో వైసీపీ నాయకుని హత్యకు కుట్ర పన్నిన టిడిపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మేడుకుర్తి గ్రామానికి చెందిన వైస్సార్సీపీ నాయకుడు జయరాంరెడ్డిని చంపడానికి టిడిపి నాయకులు గోపాలరెడ్డి ₹2లక్షలు సుపారీ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఏప్రిల్ 30న జరిగిన హత్యాయత్నం కేసులో 12 మంది ముద్దాయిలను తాడిపత్రి పోలీసులు అరెస్టు చేశారు.
* నాగలాపురం లో 2 కిలోలు గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్టు.
* పలమనేరు మండలంలో యువకుడు దారుణ హత్య..పెంగరగుంట గ్రామంలో ధనశేఖర్ మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు..ప్రేమ వ్యవహారమే కారణం అంటున్న యువకుడి బంధువులు..యువతి తల్లిదండ్రులే ధన శేఖర్ ను హత్య చేసారని ఆరోపిస్తూ నిన్న రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన ధనశేఖర్ కుటుంబ సభ్యులు..ఈ నేపథ్యంలో ఈరోజు ధనశేఖర్ మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు.