కథానాయిక మెహరీన్, కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ రాజకీయ నాయకుడు భవ్యా బిష్ణోయ్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, ప్రస్తుత కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పెళ్లిని నిరవధికంగా వాయిదా వేశారు. వచ్చే ఏడాది చేసుకోవాలనుకుంటున్నారట. ‘‘మేం (భవ్య, మెహరీన్) పెళ్లి గురించి డిస్కస్ చేసుకోవడం లేదు. పరిస్థితులు చక్కబడతాయని ఎదురు చూస్తున్నాం. అప్పటివరకూ పెళ్లి జరగదు’’ అని మెహరీన్ వెల్లడించారు. మార్చిలో వీళ్ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెహరీన్‌కు కరోనా సోకింది. ఇప్పటికీ కరోనా సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారట. కరోనా నుంచి కోలుకునే సమయంలో భవ్యా బిష్ణోయ్ తనకు ఎంతో అండగా ఉన్నారని మెహరీన్ తెలిపారు.
మెహ్రీన్ పెళ్లి వాయిదా
Related tags :