DailyDose

ఆక్సిజన్ పైపులు కత్తిరిస్తున్న అంబులెన్స్ డ్రైవర్-నేరవార్తలు

Crime News - Ambulance Driver Cutting Oxygen Pipes In Nizamabad

* కరోనా మహమ్మారితో ప్రజలు అల్లాడుతుంటే శవాల మీద చిల్లర ఏరుకునే దుర్మార్గులు బయల్దేరారు. తమకు గిరాకీ లేదని ఏకంగా ఐసీయూలోని కరోనా రోగులను చంపేందుకు కూడా వెనకాడలేదు కిరాతకులు. కరోనా రోగులకు సీరియస్‌ అయినా.. చనిపోయినా తమకు కిరాయి వస్తుందని అంబులెన్స్ డ్రైవర్లు అత్యంత కిరాతక చర్యకు పూనుకున్నారు. ఆక్సిజన్ సప్లై ఆపేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడారు. ఆస్పత్రి వార్డుబాయ్ ఆ దారుణాన్ని చూడడంతో రోగుల ప్రాణాలు నిలిచాయి. ఈ అత్యంత దారుణ ఘటన తెలంగాణలో వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ ఘోరం జరిగింది. తమకు కొద్దిరోజులుగా పేషంట్లు దొరకడం లేదని.. గిరాకీ పెంచుకునేందుకు ముగ్గురు అంబులెన్స్ డ్రైవర్లు దారుణానికి ఒడిగట్టారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ఆక్సిజన్‌ సరఫరాని ఆపేశారు. ఆక్సిజన్ సప్లై ఆగిపోవడాన్ని గమనించిన వార్డు బాయ్ వెంటనే అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఆక్సిజన్ సప్లై ఆపేసిన ఓ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్‌ను గుర్తించి ఆస్పత్రి సిబ్బంది పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిరోజులుగా అంబులెన్సులకు గిరాకీ లేదని ఎవరికైనా సీరియస్ అయినా లేకుంటే చనిపోతే తమకు గిరాకీ వస్తుందని భావించి ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ఆస్పత్రి అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.

* మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. ఐదంతస్తుల భవనంలోని స్లాబ్‌ ఒక్కసారిగా గ్రౌండ్‌ ఫ్లోర్‌కు కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన థానే జిల్లాలోని ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఉల్హాస్‌నగర్‌లోని నెహ్రూ చౌక్ వద్ద ఉన్న సాయిసిద్ధి అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తులో స్లాబ్‌ కుప్పకూలింది.

* వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం గౌతాపూర్ చెక్ పోస్ట్ వద్ద కరోనా నిబంధనలకు విరుద్ధంగా పెళ్లిళ్లకు 60 మంది ప్రయాణికులను తీసుకెళుతున్న పరిగి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ను సీజ్ చేసిన కరణ్ కోట్ పోలీసులు.ఈ సందర్బంగా చి జలంధర్ రెడ్డి మాట్లాడుతూ బొంరాస్ పేట్ మండలం లగ చర్ల గ్రామానికి చెందిన పెళ్లి వారు కార్యక్రమానికి పరిగి డిపో చెందిన ఆర్ టి సి బస్సును అద్దెకు తీసుకుని తాండూర్ కు వెళుతుండగా బస్సును ఆపి తనిఖీ చేయగా సుమారు 60 మంది ప్రయాణికులను గుర్తించడం జరిగింది. పెళ్లి కార్యక్రమానికి 20 మందికి పిల్ల తరపున పర్మిషన్ ఉన్నందున 60 మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం నేరంగా పరిగణించి బస్సు డ్రైవర్ అలాగే పెళ్లికూతురు తండ్రిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమం లో కరణ్ కోట్ ఎస్సై ఏడుకొండలు అలాగే పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

* నిజామాబాద్ జిల్లా: మాక్లూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గొట్టుముక్కల గ్రా మానికి చెందిన అకాష్‌, పోసాని మెడలో నుంచి బంగారు నగలు చోరీ చే సిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై రాజిరెడ్డి తెలిపారు.

* గుంటూరు నిజాంపట్నం పేకాట శిబిరాలపై ఎస్.ఈ బి. పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో దాడులు. 50 మంది పేకాటరాయుళ్ళు అరెస్ట్.