Movies

ఇటలీ భయం

ఇటలీ భయం

‘‘మనమంతా కరోనా మహమ్మారి మధ్యలో ఉన్నాం. ఈ సమయంలో ఇటలీ వెళ్లడానికి ముందు నేను భయపడ్డా. ఆ దేశంలో కరోనా రెండో దశ వెళ్లిపోయిందని, అక్కడి ప్రజలు మాస్క్‌లు ధరిస్తూ బాధ్యతాయుతంగా ఉన్నారని తెలిశాక… వెళ్లాం. తక్కువమందితో జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరణ చేశాం’’ అని రాశీ ఖన్నా అన్నారు. అక్కినేని నాగచైతన్యకు జోడీగా ఆమె నటిస్తున్న తాజా సినిమా ‘థాంక్యూ’. ఏప్రిల్‌లో చిత్రీకరణకు ఇటలీ వెళ్లిన చిత్రబృందం, ఈ నెల 7వ తేది తర్వాత తిరిగొచ్చారు. కొవిడ్‌-19 వల్ల చిత్రీకరణలో ఎదురైన పరిస్థితుల గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ ‘‘నిజాయతీగా చెప్పాలంటే… టైమ్‌ ప్రకారం చిత్రీకరణ పూర్తి చేయాలనే ఒత్తిడి ఉండేది. ఇండియా నుంచి వెళ్లిన కారణంగా మాకు కొన్ని పరిమితులు విధించారు. మన దేశంలో కేసులు పెరగడంతో కొన్ని లొకేషన్లలో చిత్రీకరణకు మాకు అనుమతులు ఇవ్వలేదు. కొన్నిసార్లు రోజుకు 18 గంటలు పని చేశాం. మాకు వేరే ఛాయిస్‌ లేదు. అయితే, మేం అక్కడ ఏం చిత్రీకరణ చేయాలనుకున్నామో… అవన్నీ పూర్తి చేసుకుని తిరిగొచ్చాం’’ అని చెప్పారు.