NRI-NRT

10877 బ్యాలెట్ కవర్ల లెక్కింపు

TANA 2021 Election Results Live Coverage - Total Envelopes Received 10877

తానా ఎన్నికల్లో బ్యాలెట్ల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా శనివారం మధ్యాహ్నం సియాటెల్‌లో బ్యాలెట్ కవర్లను లెక్కించారు. 10877 కవర్లు సాధారణ ఎన్నికలకు సంబంధించినవి కాగా, 57 కవర్లు ఫౌండేషన్ ట్రస్టీ ఎన్నికల్లో భాగంగా డోనర్ కోటాకు చెందినవి. మొత్తం కలిపి 10934. 10877 కవర్లలో ఎన్ని ఓట్లు ఉన్నాయనేది మరికాసేపట్లో తెలుస్తుంది. ప్రతి కవరులో ఒకటి లేదా రెండు బ్యాలెట్లు ఉండవచ్చు. అంచనా లెక్కకు రెండు ఓట్లు ఉన్నాయనుకుంటే 21754 ఓట్లు అవుతాయి. తదుపరి లెక్కింపు ప్రక్రియ…
1. 10877 బ్యాలెట్ కవర్లలో నకిలీల గుర్తింపునకు స్కానింగ్.
2. కవర్లు తెరవడం.
3. కవర్లు తెరిచి లోపల బ్యాలెట్ బార్‌కోడ్ కవర్‌పై ఉన్న బార్‌కోడ్ సరిచూడటం.
4. తేడా ఉంటే ఆయా బ్యాలెట్ల నిరాకరణ
5. మొత్తం బ్యాలెట్లు/ఓట్ల సంఖ్య ప్రకటన